హ్యాట్రిక్ సాధిస్తా.. | hat-trick Naresh confidence win bandipotu movie | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ సాధిస్తా..

Feb 15 2015 12:21 AM | Updated on Sep 2 2017 9:19 PM

హ్యాట్రిక్ సాధిస్తా..

హ్యాట్రిక్ సాధిస్తా..

తాను నటించిన ‘బందిపోటు’ విజయంతో హ్యాట్రిక్ సాధిస్తానని హీరో అల్లరి నరేష్ ధీమా వ్యక్తం చేశారు.

రాజమండ్రి సిటీ / బోట్‌క్లబ్ (కాకినాడ) :తాను నటించిన ‘బందిపోటు’ విజయంతో హ్యాట్రిక్ సాధిస్తానని హీరో అల్లరి నరేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 20న విడుదల కానున్న ‘బందిపోటు’ చిత్రబృందం శనివారం ‘దండయాత్ర’ పేరుతో రాజమండ్రి, కాకినాడల్లో హల్‌చల్ చేశారు. రాజమండ్రిలోని కళామందిర్ షోరూమ్‌లో శ్రీకారం చుట్టిన ఈ ప్రచారయాత్రలో నరేష్‌తో పాటు హీరోయిన ఈషా, నిర్మాత ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు. నరేష్ ‘అందరికీ ప్రేమికుల రోజు  శుభాకాంక్షలు’ అని చెప్పారు. కుటుంబ సమేతంగా చూడతగిన ఈ సినిమాను అందరూ  ఆదరించాలని కోరారు. యాంకర్స్ రవి, లాస్యల ఛలోక్తులతో నవ్వులు పూయించారు.

బందిపోటు బృందం అల్లరి నరేష్ మాస్క్‌లు ధరించి అసలైన అల్లరి నరేష్‌ను గుర్తించిన కొనుగోలుదారులకు బహుమతులు అందజేస్తామంటూ చిన్న పోటీ నిర్వహించారు. గుర్తించిన ఇద్దరికి నరేష్ చేతుల మీదుగా బహుమతులందజేశారు. చిత్ర నిర్మాత,హీరో ఆర్యన్ రాజేష్ పుట్టిన రోజు పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. కేక్‌ను సోదరులైన నరేష్, రాజేష్‌లు పరస్పరం తినిపించుకున్నారు. ‘అష్టాచెమ్మా’ హీరో అవసరాల శ్రీనివాస్, దర్శకుడు మోహన్‌కృష్ణ, సంగీత దర్శకుడు కళ్యాణ్ పాల్గొన్నారు.
 
 ‘బందిపోటు’ చిత్రీకరణ జిల్లాలోనే ఎక్కువ..
 ‘బందిపోటు’ సినిమాను చాలా వరకూ  జిల్లాలోనే చిత్రీకరించామని, జిల్లాలో ఎన్నో అందాలున్నాయని హీరో అల్లరి నరేష్ అన్నారు. కాకినాడలోని శ్రీనికేతన్, కళామందిర్ షాపింగ్ మహల్‌లో చిత్ర బృందం శనివారం ప్రేక్షకులను కలుసుకొంది. ఈ సందర్భంగా నరేష్  విలేకరులతో మాట్లాడుతూ   ఈ  సినిమా కొత్త రకం కామెడీతో అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. తన 50వ చిత్రం కోసం మంచి కథను వెతుకుతున్నట్టు చెప్పారు.

టీమిండియా వరల్డ్‌కప్ మళ్లీ గెలుస్తుందని, ఆదివారం పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో మనదే విజయమని అన్నారు. నటుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ తాను కాకినాడ  ఆశ్రమ పాఠశాల్లో చదువుకున్నానని, ఈ నగరమంటే ఎంతో ఇష్టమన్నారు. ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ తన తండ్రి  స్థాపించిన ఇవివి బ్యానర్‌లో ఈ చిత్రం తీశామని, ఈ బ్యానర్‌పై ఇతర హీరోలతోనూ సినిమాలు తీస్తామని చెప్పారు. హీరోయిన్ ఈషా మాట్లాడుతూ సినిమాను విజయవంతం  చేయాలని కోరారు. దర్శకుడు మోహన్‌కృష్ణ మాట్లాడుతూ సినిమా తప్పక విజయం సాధిస్తుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement