రాష్ట్రంలో 73 గ్రూప్–1 పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మే 7న ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష నిర్వహించనుంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 73 గ్రూప్–1 పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మే 7న ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష నిర్వహించనుంది. ఈ పోస్టులకు 93,482 మంది దరఖాస్తు చేశారని, వీరికి ఏపీలోని 174 కేంద్రాల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులను ఉదయం 9.30–10.00 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గ్రేస్ పీరి యడ్ కింద మరో 15 నిమిషాలు అంటే 10.15 వరకు అనుమతిస్తారు.