ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు.
	విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 66 వ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్..  తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ స్థాయిలో మహనీయులను తలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగాన్ని ఆరంభించారు.
	
	ప్రజలకు మరింత చేరువగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మిషన్ అప్రోచ్ తో  ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.  స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
