
సాక్షి, పుట్టపుర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ అశోక్ కుమార్, ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
సాయి దర్శనం అనంతరం ట్రస్ట్ సేవల గురించి ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. అనంతరం నరసింహన్ బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు.