బోటు వెలికితీత.. అత్యంత బాధాకరం

Godavari Boat Accident: Royal Vasista Boat Operation Success - Sakshi

కుళ్లిపోయిన మృతదేహాలు

సాక్షి, దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీశారు.అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో బోటును బయటకు తీశారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌‌ను సక్సెస్ చేసింది. కొద్దిసేపటి క్రితమే ధర్మాడి బృందం బోటును ఒడ్డుకు చేర్చింది. బోటును వెలికితీయడంతో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతున్నాయి.  

(చదవండి : కచ్చులూరు వద్ద బోటు వెలికితీత)

ప్రమాదం జరిగి 38 రోజు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. బోటు పూర్తిగా ధ్వంసమైంది. బోటు శిథిలాల్లో మృతదేహాలు చిక్కిపోయాయి. ఎముకల గూళ్ల మాదిరిగా ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు,కుటుంబ సభ్యులు విచారంలో మునిగారు. దుర్వాసన వస్తుండంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.   కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 

ఆచూకీ లభించనివారి వివరాలు:

  1. కర్రి మణికంఠ, తండ్రి నరసింహారావు, పట్టిసీమ పోలవరం..
  2. మధుపాడ కుశాలి, తండ్రి రమణబాబు, విశాఖపట్నం
  3.  మధుపాడ అఖిలేష్ (5), తండ్రి  రమణబాబు, విశాఖపట్నం
  4. తలారి గీతా వైష్ణవీ (5), తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం,.
  5. తలారి ధాత్రి (18నెలల) తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం
  6. బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6), తండ్రి,మహేశ్వరరెడ్డి, నంద్యాల..
  7. సంగాడి నూకరాజు (58), (బోటు డ్రైవర్‌) తండ్రి కామరాజు, జగన్నాధపురం, కాకినాడ
  8. పోలాబత్తుల సత్యనారాయణ (50) (డ్రైవర్‌), తండ్రి, అప్పారావు, కాకినాడ,
  9. చిట్లపల్లి గంగాధర్ (35), తండ్రి సత్యనారాయణ, నర్సాపురం..
  10. కొమ్ముల రవి (40), తండ్రి శామ్యూల్, కడిపికొండ వరంగల్
  11. కోడూరి రాజకుమార్(40), తండ్రి గోవర్ధన్, కడిపికొండ, వరంగల్
  12. బస్కీ ధర్మరాజు, తండ్రి కొమరయ్య, వరంగల్..
  13. కారుకూరి రమ్యశ్రీ (22),  తండ్రి సుదర్శన్, నన్నూరు మంచిర్యాల్.
  14. సురభి రవీందర్ (25), తండ్రి వెంకటేశ్వరరావు, హాలీయా నల్గొండ
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top