క్రీడాకారిణి సంకీర్తనకు ఎంబీబీఎస్ సీటు ఇవ్వండి! | Give MBBS seat to player sankirtana! | Sakshi
Sakshi News home page

క్రీడాకారిణి సంకీర్తనకు ఎంబీబీఎస్ సీటు ఇవ్వండి!

Oct 8 2016 3:47 AM | Updated on Oct 16 2018 2:57 PM

బీజింగ్(చైనా)లో 2015 మే 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఫెన్సింగ్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన

విజయవాడ స్పోర్ట్స్: బీజింగ్(చైనా)లో 2015 మే 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఫెన్సింగ్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కొండేపూడి సంకీర్తనకు ఎంబీబీఎస్ సీటు కేటాయించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె లాయర్లు శుక్రవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జి.అనురాధకు అందజేశారు. ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో స్పోర్ట్స్ కోటా కింద సంకీర్తన దరఖాస్తు చేసుకోగా, ఆమె సర్టిఫికెట్ల పరిశీలనకు శాప్‌కు పంపించారు.

అయితే శాప్ ఇచ్చిన ప్రాధాన్యతా క్రమం మేరకు సీటు లభించకపోవడంతో సంకీర్తన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై దీపక్ మిశ్రా, ఉదయ్ ఉమేష్‌లలిత్‌లతో కూడిన 4వ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ప్రతిభ గణన సక్రమంగా నిర్వహించి ప్రాధాన్యత ప్రకారం ఎంబీబీఎస్ సీటు కేటాయించాలని, ఇందుకోసం వారం గడువు ఇస్తున్నట్లు కోర్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన పత్రాలను సంకీర్తన, ఆమె న్యాయవాదులు, తల్లిదండ్రులు హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జి.అనురాధకు అందజేశారు. అప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియడంతో దీనిపై అనురాధ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలను శాప్ పంపుతామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement