చెత్తకుండిలో పేలుడు: బాలికకు తీవ్రగాయాలు | Girl injured as dust bin explodes | Sakshi
Sakshi News home page

చెత్తకుండిలో పేలుడు: బాలికకు తీవ్రగాయాలు

Dec 15 2013 9:01 AM | Updated on Sep 2 2017 1:39 AM

చెత్తకుండిలో పేలుడు సంభవించి వీరవాణి (15) అనే బాలిక తీవ్రంగా గాయపడిన సంఘటన యానాంలోని సావిత్రి నగర్లో నిన్న చోటు చేసుకుంది.

చెత్తకుండిలో పేలుడు సంభవించి వీరవాణి (15) అనే బాలికతోపాటు మరో మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన యానాంలోని సావిత్రి నగర్లో నిన్న చోటు చేసుకుంది. ఆ ఘటనలో మహిళకు స్వల్పగాయాలు కాగా, బాలికను తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

 

అయితే ఆ బాలిక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్య సాయం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆ బాలికను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చెత్త కుండిలో పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మందుగుండి సామాగ్రిని చెత్తకుండిలో వేయడం వల్లే ఆ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement