గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణపై వర్క్‌షాపు

Girija Shankar Comments Over Grama Ward Secretariat Exam In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పిలుపునిచ్చారు. పరీక్షల నిర్వహణపై విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాపును కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్‌ మాట్లాడుతూ... చరిత్రలో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ ఒకటో తేదీన 4 ,478 సెంటర్లలో జరిగే పరీక్షలకు పదిహేను లక్షల యాభై ఎనిమిది వేల మంది హాజరు కానున్నారని తెలిపారు. ఇక క్రమశిక్షణ నిబద్దతతో పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారులకు సూచించారు. పరీక్షా సమయం పూర్తయ్యే వరకు ఏ అభ్యర్థిని కూడా బయటకు పంపరాదని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌ను బయటకు తీసుకెళితే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top