రాజధాని నిర్మాణంలో యువశక్తి కీలకం | Gautam savang launched 'Layola run for Amravati' | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణంలో యువశక్తి కీలకం

Jan 29 2016 7:01 PM | Updated on Aug 18 2018 3:49 PM

రాజధాని అమరావతి నిర్మాణంలో యువశక్తి కీలకమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు.

‘లయోలా రన్ ఫర్ అమరావతి’ని ప్రారంభించిన గౌతమ్ సవాంగ్
విజయవాడ (మొగల్రాజపురం)

రాజధాని అమరావతి నిర్మాణంలో యువశక్తి కీలకమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆంధ్రా లయోలా కళాశాల, ఆంధ్రా లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన ‘లయోలా రన్ ఫర్ అమరావతి’ కార్యక్రమాన్ని గౌతమ్‌సవాంగ్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలన్నారు. నా ఇటుక-నా అమరావతిలో భాగంగా కళాశాల యాజమాన్యం విద్యార్థుల తరపున నాలుగు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలను ఆన్‌లైన్ ద్వారా రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నామని కళాశాల డెరైక్టర్ రవిశేఖర్ తెలిపారు.


మైదానంలో రాష్ట్ర మ్యాప్ ఆకారంలో విద్యార్థులు కూర్చుని అలరించారు. పద మూడు జిల్లాల పేర్లు తెలిసేలా జెండాలు పట్టుకోవడంతో పాటుగా జిల్లాకు ఒక రంగు వంతున 13 రంగుల టోపీలను ధరించారు. అనంతరం జరిగిన రన్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement