నిధుల ఫ్రీజింగ్...! | Funds Freising ...! | Sakshi
Sakshi News home page

నిధుల ఫ్రీజింగ్...!

Mar 7 2014 3:43 AM | Updated on Sep 2 2017 4:25 AM

ట్రెజరీ కార్యాలయం నుంచి నిధుల చెల్లింపులపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిన ట్లు సమాచారం. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.

సాక్షి, కడప: ట్రెజరీ కార్యాలయం నుంచి నిధుల చెల్లింపులపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిన ట్లు సమాచారం. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. జీతాలతో పాటు కొన్ని అత్యవసర బిల్లులు తప్ప మిగతా అన్ని  చెల్లింపులు నిలిచి పోనున్నాయి. జిల్లాలో దాదాపు రూ. 50 కోట్ల మేర బిల్లుల చెల్లింపుపై ప్రభావం పడనుంది. బిల్లుల చెల్లింపులు సిద్ధంగా ఉన్నప్పటికి ప్రభుత్వంపై రెవిన్యూ భారం పడకుండా తాత్కాలికంగా ఫ్రీజింగ్ విధించినట్లు తెలుస్తోంది.మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఉద్యోగుల జీతాలు,మెడికల్,జైలు, హాస్టల్ డైట్ చార్జీలు, జీఫీఎఫ్,లోన్స్ అండ్‌ఆడ్వాన్స్‌లు,మెడికల్ రీయింబర్స్‌మెంట్,పెన్షన్స్, వడ్డీ చెల్లింపులు  మినహా మిగతా అన్నింటిపై ఫ్రీజింగ్ విధించారు. గురువారం నుంచే ఇది అమలులోకి వచ్చింది.
 
 ఆగిపోయే చెల్లింపులు ఇవే...
 విద్యార్థుల స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మధ్యాహ్న భోజన బిల్లులు నిలిచిపోనున్నాయి.  దీంతో పాటు ప్రయాణ భత్యం,ఆఫీసు సాధారణ నిర్వహణ ఖర్చులు, టెలిఫోన్, విద్యుత్తు శాఖ బిల్లులు,కార్యాలయ భవనాల అద్దెలు, వాహనాల అధ్దెలు, పెట్రోల్ బిల్లులు నిలిచి పోనున్నాయి ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉండటం ఈ నిధులను మార్చిలోపు ఖర్చు చేయాల్సి ఉండటంతో అధికారుల్లో అందోళన నెలకొంది.
 
 తాత్కాలికంగా నిలిపి వేశాం!
 జీతాలు, అత్యవసర బిల్లులు తప్ప మిగతా వాటిని తాత్కాలికంగా నిలిపి వేశాం. మార్చి 15వ తేదీ తరువాత అంచెలంచెలుగా బిల్లులకు చెల్లింపులు జరుగుతాయి.అందోళన చెందనవసరంలేదు. తదుపరి చెల్లింపులు ప్రభుత్వ ఆధేశాల మేరకు చేస్తాం.
 - రంగప్ప,  ట్రెజరీ ఉప సంచాలకులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement