గంజాయి నియంత్రణకు కార్యాచరణ | Functionality to control cannabis | Sakshi
Sakshi News home page

గంజాయి నియంత్రణకు కార్యాచరణ

Mar 4 2016 12:03 AM | Updated on Sep 3 2017 6:55 PM

రాష్ర్ట వ్యాప్తంగా గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు తక్షణం కార్యాచరణ నివేదిక రూపొం దించాలని రాష్ర్ట ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించా రు. విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో

15 మంది అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
4 జిల్లాలో ఎక్సైజ్ అధికారుల సమీక్షలో మంత్రి కొల్లు
‘సాక్షి’ కథనంపై విస్తృత చర్చ
 

విశాఖపట్నం: రాష్ర్ట వ్యాప్తంగా గంజాయి సా గు, రవాణాను నియంత్రించేందుకు తక్షణం కార్యాచరణ నివేదిక రూపొం దించాలని రాష్ర్ట ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించా రు. విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వనమంతాగం‘జాయ్’ శీర్షకన సాక్షిలో గురువారం ప్రచురితమైన టాస్క్ ఫోర్స్ కథనం ప్రకంపనలు సృష్టించింది. ఈ కథనంపై విస్తృతచర్చ జరిగింది. రాష్ర్టంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే విశాఖ ఏజెన్సీలో పెద్దఎత్తున గంజాయి సాగవుతోంద ని, ఇక్కడ నుంచి ఒడిశా, మహారాష్ర్ట తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుందని ఎక్సైజ్ అధికారులు మంత్రికి వివరించారు. ఉన్న కొద్దిపాటి సిబ్బం దితో ఎప్పటికప్పుడు నిఘా ఉంచి పెద్దఎత్తున రవాణా అవుతున్న గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఆధునిక సాంకేతిక వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ శాటిలైట్ ద్వారా గంజాయి సాగవుతున్న ప్రాంతాలను గుర్తించి దాడులు నిర్వహించాలని మంత్రి సూ చించారు. ఇందుకు బాధ్యులైన వారి పై పీడీ యాక్టు నమోదు చేయాల న్నారు.

ఆయా ప్రాంతాల్లో నడిచే వాహనాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. మే, జూన్, జూలై  గం జాయి సాగుకు అనువైన మాసాలని, ఆయా నెలల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గంజాయి సాగును గుర్తిం చేందుకు అవసరమైతే స్నిఫర్ డాగ్స్ సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. గంజాయి సాగు, రవాణాను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కార్యాచరణ రూపొందించేందుకు 15 మంది సీనియర్ ఆఫీసర్లతో రాష్ర్ట స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
 మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తే అందుకు సంబంధిత ఎక్సైజ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. మద్యం క్రయ, విక్రయాలను ఎక్సైజ్ అధికారులు   పర్యవేక్షించాలని, ఆన్‌లైన్ ట్రాక్,   ట్రేసింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు పర్చాలన్నారు. నాటుసారా నియంత్రణకు అమలు చేస్తున్న నవోదయం విజయవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ గ్రామాల వారీగా ఈ కార్యక్రమంపై ఇప్పటివరకు విస్త్రత ప్రచారం కల్పించాలన్నారు. ఇకపై నాటుసారా తయారీ బట్టీలు ఎక్కడ కన్పించినా ఉపేక్షించేది లేదన్నారు. మార్చి 15 నుంచి పెద్దఎత్తున దాడులు నిర్వహించాలన్నారు. రాష్ర్ట ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, సంచాలకులు ఎ.చంద్రశేఖర్ నాయుడు, నాలుగు జిల్లాల ఎక్సైజ్ డెప్యుటీ కమిషనర్లు చైతన్య మురళి(విజయనగరం), సురేంద్ర ప్రసాద్ (శ్రీకాకుళం), ఎం.సత్యనారాయణ(తూర్పుగోదావరి),అసిస్టెంట్ కమిషనర్ ఎస్‌విఏఎన్ బాబ్జీ రావు(విశాఖ) తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement