ధర.. దగా | Sakshi
Sakshi News home page

ధర.. దగా

Published Wed, Feb 26 2014 4:10 AM

formers are demanding for agriculture

ప్రభుత్వ మద్దతుధర ఇవ్వకుండా దగాచేస్తున్న దళారులపై పల్లీ రైతన్నలు తిరగబడ్డారు. రేయింబవళ్లు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంపై కన్నెర్రచేశారు. తమ కష్టనష్టాలను విన్నవించినా పట్టించుకోని పాలకవర్గం తీరును ఆక్షేపిస్తూ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అన్నదాతలు కనిపించిన వస్తువునల్లా ధ్వంసం చేశారు. రైతుల ఆగ్రహావేశాలకు అధికారులు  హడలిపోయారు.
 
 జడ్చర్ల, న్యూస్‌లైన్: ఆరుగాలం శ్రమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌చేస్తూ వందలాది మం ది పల్లీరైతులు మంగళవారం బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్‌యార్డును ముట్టడించారు. తీవ్ర అసంతృప్తిలో రగి లిపోయిన అన్నదాతలు మార్కెట్ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసంచేశారు.
 
 జిల్లాలోని నారాయణపేట, జడ్చర్ల, తిమ్మాజీపేట, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలతో పాటు పరిగి, తాండూరు ప్రాంతాల నుంచి రెండువేల మంది రై తులు బాదేపల్లి మార్కెట్‌కు 25వేల బస్తాలకు పైగా వేరుశనగను తెచ్చారు. విక్రయానికి ఉంచి సుమారు రెండువే ల కుప్పలను పోశారు. వ్యాపారులు టెండర్లు వేసిన అ నంతరం ధరలు ప్రకటించారు. క్వింటాలుకు రూ.2000 నుంచి రూ.3400 వరకు ధరలు లభించాయి. ఏమైనా ధరలు పెంచుతారేమోనని రైతులు ఎంతోఆశగా
 ఎదురుచూశారు. అయినా ఎలాంటి స్పందనరాలేదు. దీంతో తమకు కనీస మద్దతుధరలు దక్కకపోవడంపై తీవ్ర ఆ గ్రహావేశాలు వ్యక్తంచేస్తూ మూకుమ్మడి గా మార్కెట్ కార్యాలయంపై దాడికి పూ నుకున్నారు. రాళ్లతో దాడిచేసి కిటికీల అ ద్దాలను ధ్వంసంచేశారు. అనంతరం కా ర్యాలయంలోకి దూసుకెళ్లి విద్యుత్ బ ల్బులు, ట్యూబ్‌లు, సీపీ కెమెరాలను సై తం పగులగొట్టారు. అదేవిధంగా కార్యాలయంపై అంతస్తులోకి వెళ్లిన రైతులు సమావేశ మందిరంలోని ఫ్రిజ్‌ను, ఫర్నీచర్‌ను కిందకుదోశారు.
 
 అక్కడే ఉన్న సి బ్బంది ప్రాణభయంతో పరుగులు తీశా రు. రైతుల దాడినుంచి మార్కెట్ సహా య కార్యదర్శి అబ్దుస్ సమీ తప్పించుకు ని బయటపడ్డాడు. అనంతరం యార్డు కార్యాలయం ఎదుట బైఠాయించి రెండుగంటల పాటు ధర్నా చేపట్టారు. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలుచేశారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేశారు.
 
 మార్కెట్‌లో తాము కొ నుగోలుచేసే పల్లీ నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, అష్టకష్టాలు పడి పండించిన పంటలకేమో అతి తక్కువ ధ రలు కేటాయించడం ఏమిటని పలువురు రైతులు నిలదీశారు. కాగా ప్రభుత్వం వే రుశనగకు కనీస మద్దతు ధర రూ.4000 కేటాయించినా ఆ ధర ఎక్కడా అమలుకావడం లేదని ఆక్రోశించారు. విషయం తె లుసుకున్న సీఐలు జంగయ్య, శ్రీనువాస్‌రెడ్డి, ఎస్‌ఐలు చంద్రమౌళి, సైదులు త దితరులు చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు. ఈ సందర్భంగా సీఐ జంగయ్య తో వాగ్వాదానికి దిగారు. రైతులకు సీఐ, తదితర పోలీసులు నచ్చజెప్పి శాంతపరిచారు. పోలీసులు అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్నారు.
 
 సమస్య కమిషనర్ దృష్టికి
 అనంతరం స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి.. ఇక్కడి మార్కెట్‌లో రై తుల ఆందోళన, మద్దతు ధరలు తదితర సమస్యలను మార్కెటింగ్ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులకు మద్దతుధరలు కల్పించాలని తాము మొదటి నుంచి అధికారులు, ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేకపోయిందని, కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
 ఇంతకుముందే..
 ఈ సీజన్‌లో వేరుశనగకు ప్రారంభం నుంచి రైతులకు ప్రభుత్వ మద్దతు ధరలు లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ధరలు పతనం కావడంతో లబోదిబోమంటూ ఆందోళన బాటపడుతున్నారు. గతవారం రోజులుగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనలు మరింత ఉద్రిక్తతతకు దారి తీస్తున్నాయి. వారంరోజుల క్రితం నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రధాన రహదారిపై ఖాళీ బస్తాలకు నిప్పంటించి పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. అదేవిధంగా మరుసటి రోజు కూడా దాదాపు రెండు గంటలకు పైగా రాస్తారోకో చేపట్టారు. క్వింటాలుకు రూ.100 ధర పెంచడంతో శాంతించారు. మళ్లీ మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో మంగళవారం మరోసారి రైతులు దాడులకు పూనుకున్నారు. దీంతో మార్కెట్‌లో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేస్తారో లేదో వేచిచూడాలి.
 

Advertisement
Advertisement