అనారోగ్యంతో వైఎస్‌ఆర్సీపీ నేత మృతి | former palasa mla Juttu Jagannayakulu passes away | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో వైఎస్‌ఆర్సీపీ నేత మృతి

Nov 4 2017 11:54 AM | Updated on May 29 2018 4:40 PM

former palasa mla Juttu Jagannayakulu passes away - Sakshi

పలాస మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత జుత్తు జగన్నాయకులు(ఫైల్‌ ఫొటో)

పలాస మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు.

సాక్షి, విశాఖపట్నం: పలాస మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు.

జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. జగన్నాయకులు 2009 నుంచి 2014 వరకు పలాస ఎమ్మెల్యేగా పని చేశారు. 

జుత్తు జగన్నాయకులు మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబం మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement