ఓటు హక్కు నమోదు చేసుకోవాలి | everyone to register the right to vote | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

Dec 23 2013 3:33 AM | Updated on Oct 8 2018 5:04 PM

18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మానుకోట ఇన్‌చార్జ్ తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి సూచించారు.

మహబూబాబాద్, న్యూస్‌లైన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మానుకోట ఇన్‌చార్జ్ తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఆ కేంద్రంలో ముగ్గురు హిజ్రాలు తమ ఓటు హక్కు నమోదు ఫారాలను నింపి సిబ్బందికి అందజేశారు. మరో 17 మంది హిజ్రాలకు సంబంధించిన ఫారాలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు. హిజ్రాలను ఓటరు నమోదులో అదర్స్‌గా  నమోదు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాపారావు, బూద్యానాయక్, వీఆర్వో కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
 యువత సన్మార్గంలో పయనించాలి
 ధర్మసాగర్, న్యూస్‌లైన్ : యువత సన్మార్గాన్ని ఎంచుకోవాలని కేయూ ప్రోఫెసర్ పింగళి నర్సింహరావు అన్నారు. ఆదివారం మండలంలోని వేలేరు గ్రా మంలో విద్యాజోతి డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం సందర్భంగా వ్యక్తిత్వ వికాసం అంశంపై ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ పసుల ఎల్ల య్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.2020సంవత్సరం నాటికి భారతదేశ జనాభాలో సగానికి పైగా యువతే ఉంటుందన్నారు. యు వత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పోగ్రాంఅధికారి యాదగిరి,సర్పంచ్ విజయపూరి మల్లిఖార్జున్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement