నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ ఎన్నికల ప్రచారం! | election campaign in Nagababu's son Varun Tej | Sakshi
Sakshi News home page

నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ ఎన్నికల ప్రచారం!

Aug 31 2014 12:19 AM | Updated on Oct 16 2018 6:27 PM

నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ ఎన్నికల ప్రచారం! - Sakshi

నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ ఎన్నికల ప్రచారం!

సినీనటుడు, మెగా బ్రదర్‌‌సలో ఒకరైన నాగబాబు కుమారుడు హీరో వరుణ్‌తేజ్ అమలాపురంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలన్నీ అయిపోయాయి కదా!

 సినీనటుడు, మెగా బ్రదర్‌‌సలో ఒకరైన నాగబాబు కుమారుడు హీరో వరుణ్‌తేజ్ అమలాపురంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలన్నీ అయిపోయాయి కదా! ఇప్పుడు ఎన్నికల ప్రచారమేంటి? అనుకుంటున్నారా..? అదేం లేదండీ ఆయన నటిస్తున్న ‘ముకుంద’ సినిమా షూటింగ్ అమలాపురంలో శరవేగంగా జరుగుతోంది. దీనిలోని కీలకమైన మున్సిపల్ చైర్మర్ ఎన్నికల సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.  వరుణ్‌తేజ్  పట్టణంలోని గారపాటి వీధిలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న సన్నివేశాలను షూట్ చేశారు.  లియో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.   చిత్రంలో ప్రతినాయకునిగా రావు రమేష్, అతని కూతురిగా హీరోయిన్ పూజా హెగ్డే  నటిస్తున్నారు.  
 
 కథ ప్రకారం.. హెగ్డే  తండ్రి తరఫున ఓట్లు అభ్యర్థిస్తుండగా,  అక్కడ వరుణ్‌తేజ్ తారసపడతాడు. అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆమె కారు ఎక్కే సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారు. వినాయకచవితి రోజూ  షూటింగ్ జరిగింది. నటుడు ప్రకాష్‌రాజ్‌పై సన్నివేశాలను చిత్రీకరించారు. కాపు కల్యాణ మండపం దగ్గర వేసిన భోగిమంట సెట్టింగ్ వద్ద  ‘రాజకీయ కాలుష్యం ఈ మంటల్లో కడతేరిపోవాలి’ అంటూ ఆయన డైలాగ్ చెబుతుండగా, సన్నివేశాన్ని చిత్రీకరిం చారు.  పిల్లల పార్కు వద్ద కూడా  వరుణ్‌తేజ్, ప్రకాష్‌రాజ్‌పై  సన్నివేశాలను షూట్ చేశారు. షూటింగ్‌ను తిల కించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.   - అమలాపురం టౌన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement