డీఎస్సీ పోస్టులకు కోత | DSC posts are deducted | Sakshi
Sakshi News home page

డీఎస్సీ పోస్టులకు కోత

Nov 23 2014 1:12 AM | Updated on May 25 2018 5:44 PM

అనుకున్నట్టే జరిగింది. డీఎస్సీ పోస్టుల్లో ప్రభుత్వం కోత విధించింది.

విశాఖ రూరల్: అనుకున్నట్టే జరిగింది. డీఎస్సీ పోస్టుల్లో ప్రభుత్వం కోత విధించింది. జిల్లా విద్యా శాఖ నోటిఫై చేసిన వాటి కంటే 131 పోస్టులను తగ్గించింది. 1056 పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 232 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టులు వారీ వివరాలు మాత్రం మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. జిల్లాలో ఉపాధ్యాయల పోస్టుల ఖాళీల అధికంగా ఉన్నప్పటికీ తక్కువ సం ఖ్యలో భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో డీఎస్సీ  అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో 2500 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

అయితే రేషనలైజేషన్ చర్యలతో పోస్టులను కుదించి 1714 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కూడా కోత విధిస్తూ విద్యా శాఖ అధికారులు 1187 పోస్టులను నోటిఫై చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 131 పోస్టులను తగ్గిస్తూ 1056 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యా శాఖ నోటిఫై చేసిన వాటిలో ఎస్జీటీలో 117 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్‌లో 11, పీఈటీలో 3 పోస్టులను తగ్గించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 1056 పోస్టుల్లో ఏజెన్సీలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాక్‌లాగ్ పోస్టులు 232 ఉండగా ప్రస్తుతం 824 పోస్టులు ఉన్నాయి. అయితే రోస్టర్ విధానం, సబ్జెక్టుల వారీ ఖాళీలు, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పోస్టుల వివరాలపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement