జిల్లాస్థాయి చెస్ పోటీలు | district level chess competitions | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి చెస్ పోటీలు

Dec 9 2013 4:57 AM | Updated on Sep 2 2017 1:24 AM

కింగ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించారు.

నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: కింగ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. పోటీలను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ట్రస్మా) జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధాశక్తిని, ఓపిక, సహనాన్ని పెంపొం దించే చెస్‌ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. క్రీడల నిర్వహణకు ట్రస్మా సహకరిస్తుందని తెలిపారు. ఉత్తమ క్రీడాకారుడి పేరు చిరస్థాయిగా ఉంటుందని, మరుగునపడిపోని గుర్తింపు లభిస్తుందన్నారు.

కార్యక్రమంలో ఆర్గనైజర్లు ఎం.విశ్వప్రసాద్, వి.మట్టయ్య, జరీఫొద్దీన్ పాల్గొన్నారు. కాగా జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. మొదటి 10 స్థానాల్లో రవికుమార్(హుజూర్‌నగర్), పీవీ ఎస్ అరవింద్(మిర్యాలగూడ), బి.సత్యనారాయణ(కోదాడ) వి.మట్టయ్య(నల్లగొండ), బి.సంజయ్‌భార్గవ్(మిర్యాలగూడ), మేడం పవన్‌తేజ(నల్లగొండ), బి.భానుమహేశ్(సూర్యాపేట), సిహెచ్.మహేశ్(నల్లగొండ), ఎస్‌కె.బర్షిత్(హాలియా) పి.మధుసూదన్(నల్లగొండ) నిలిచారు. అలాగే బెస్ట్ మహిళా విజేతగా ఎం.అలేఖ్య(నల్లగొండ), అండర్‌గ్రూప్స్‌లో మరో 20 మంది బాల, బాలికలకు బహుమతులు, మెమోం టోలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement