లైంగిక దాడులపై విస్త­ృత చర్చలు చేపట్టాలి: జి. రోహిణి | Sakshi
Sakshi News home page

లైంగిక దాడులపై విస్త­ృత చర్చలు చేపట్టాలి: జి. రోహిణి

Published Fri, Jan 10 2014 2:37 AM

లైంగిక దాడులపై విస్త­ృత చర్చలు చేపట్టాలి: జి. రోహిణి - Sakshi

చిత్తూరు, న్యూస్‌లైన్: పిల్లలపై జ రుగుతున్న లైంగిక దాడుల నివారణకు విస్తృతంగా చర్చలు జరగాలని హైకోర్టు సీనియర్ న్యాయమూ ర్తి, న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర కార్యనిర్వాహక చైర్‌పర్సన్ జస్టిస్ రోహిణి అన్నారు. చిత్తూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘పిల్లలపై లైంగిక దాడుల నివారణ చట్టం’పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జస్టిస్ రోహిణి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పిల్లలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘట నలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితం రూపొందించిన పిల్లలపై లైంగిక దాడుల నివారణ చట్టాన్ని అమలుచేయడంలో పోలీసులదే బాధ్యతని పేర్కొన్నారు.
 
 బాధిత పిల్లల్ని పదేపదే న్యాయస్థానాలకు పిలిపించకుండా ఘటన జరిగిన ఏడాదిలోపు కేసును పరిష్కరించి నిందితుల్ని శిక్షించడానికి న్యాయాధికారులు, పోలీసులు సహకరించాలని కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని పిల్లల్ని రక్షించుకోవడానికి నూతన చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

Advertisement
Advertisement