‘పసుపు రంగు’ కోడ్‌లోకి రాదా? | Did Not Get 'Yellow' Into Election Code? | Sakshi
Sakshi News home page

‘పసుపు రంగు’ కోడ్‌లోకి రాదా?

Mar 4 2019 5:24 PM | Updated on Mar 4 2019 5:24 PM

 Did Not Get 'Yellow' Into Election Code? - Sakshi

ఉప్పుగూడెంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి పసుపు రంగు వేసిన దృశ్యం 

సాక్షి, దెందులూరు: మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పసుపు రంగు వేయటం ఏమిటని, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చి వారం రోజులు కావస్తున్నా పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ బొమ్మనబోయిన నాని ప్రశ్నించారు. ఆదివారం పోతునూరు గ్రామ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీతంపేట, ఉప్పుగూడెం, పోతునూరు, చల్లచింతలపూడి, దెందులూరు, గోపన్నపాలెం, జోగన్నపాలెం, శ్రీరామవరంలతో పాటు గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు, స్త్రీ శక్తి భవనాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు పసుపు రంగు వేశారన్నారు. ఎన్నికల కోడ్‌ అమలుకు మండల, డివిజన్, జిల్లా అధికారులను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించినప్పటికీ పసుపు రంగుపై పర్యవేక్షణ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వ కార్యాలయాలపై పసుపు రంగుపై ఫిర్యాదు చేస్తామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement