ఢిల్లీ బహుత్ దూర్ హై ! | Delhi bahut door hai, says Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

ఢిల్లీ బహుత్ దూర్ హై !

Jan 25 2014 3:11 AM | Updated on Jul 29 2019 5:31 PM

ఢిల్లీ బహుత్ దూర్ హై ! - Sakshi

ఢిల్లీ బహుత్ దూర్ హై !

ఢిల్లీ బహుత్ దూర్ హై’ అని తన ఢిల్లీ పర్యటన వారుుదాపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ వారుుదా పడ్డాక తన చాంబర్ నుంచి బయుటకు వెళ్తున్న సీఎం అక్కడే ఉన్న మీడియా..

సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ‘ఢిల్లీ బహుత్  దూర్ హై’ అని తన ఢిల్లీ పర్యటన వారుుదాపై వుుఖ్యవుంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడ్డాక తన చాంబర్ నుంచి బయుటకు వెళ్తున్న సీఎం అక్కడే ఉన్న మీడియాను పలకరించారు. ‘ఏం సార్! ఇష్టాగోష్ఠిగా సంభాషిస్తారేమోననుకుంటే మాట్లాడ్డమే మానేశారు!’ అని విలేకరులు అన్నారు. ‘అసెంబ్లీ జరుగుతోంది కదా? మీకు రాసుకోవడానికి కావలసినంత సబె ్జక్టు ఉంది. ఇంకెందుకు మాట్లాడ్డం?’ అని కిరణ్ బదులిచ్చారు. అసెంబ్లీలో మళ్లీ మాట్లాడతారా అని ప్రశ్నించగా ఇంకో గంటన్నరసేపు మాట్లాడతానని, బహుశా అది రేపే కావచ్చని చెప్పారు.
 
 ఢిల్లీ పర్యటన సంగతేమిటని అడిగితే ఒకింతసేపు ఆగి, ‘ఢిల్లీ బహుత్ దూర్ హై’ అంటూ వెళ్లిపోయారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నాక కిరణ్ ఢిల్లీ వెళ్లవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పిలుపు మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా విభజన బిల్లుపై అసెంబ్లీ కొనసాగుతున్నందున వెళ్లలేదు. ఉదయం దిగ్విజయ్‌కి ఇదే విషయం ఫోన్‌లో చెప్పినట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఒకటి రెండ్రోజుల్లో వీలు చూసుకుని వస్తానని చెప్పారన్నాయి.
 
 ఓటేసే పరిస్థితి లేదన్న బొత్స
 వురోవైపు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. దిగ్విజయ్‌తో పాటు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ తదితర పెద్దలను కలవనున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీ అభ్యర్థులకు ఓటేస్తారు, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తదితరులను బుజ్జగించడం తదితరాలపై చర్చించనున్నారు. పార్టీ తరఫున నాలుగో అభ్యర్థిని రాజ్యసభ బరిలో దింపాలా, టీఆర్‌ఎస్ సూచించే అభ్యర్థికి మద్దతివ్వాలా అన్నదీ చర్చకు రావచ్చు.
 
 సాంకేతికంగా కాంగ్రెస్‌కు నాలుగు దక్కాల్సి ఉన్నా విభజన నిర్ణయంపై సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారడం తెలిసిందే. ‘‘మనం రెండు మాత్రమే గెలిచే పరిస్థితి ఉంది. సీమాంధ్రలోని 96 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసే పరిస్థితి లేదు’’ అని అధిష్టానానికి బొత్స విన్నవించినట్టు సమాచారం. దాంతో తెలంగాణ నుంచి ఒక్కరినే నిలబెట్టి, ఎంఐఎం, టీఆర్‌ఎస్ మద్దతుతో గట్టెక్కించి... అక్కడి తమ బలాన్ని సీమాంధ్రలో ముగ్గురు అభ్యర్థులకు బదిలీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. సీమాంధ్ర ఎమ్మెల్యేలను బుజ్జగించి వారి ఓట్లు పొందేందుకు రాహుల్‌గాంధీ బృందంలో కీలకంగా ఉన్న కొప్పుల రాజును, బీసీ వర్గం నుంచి కొత్తవారిని బరిలో దించే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో అభ్యర్థిగా కేవీపీ రామచంద్రరావు బరిలో ఉంటారని తెలుస్తోంది.
 
 ‘రాజ్యసభ’పై బొత్స కన్ను!
 బొత్స కూడా రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు! సొంత జిల్లాలో వ్యతిరేకత నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొద్దని భావిస్తున్నారు. పార్టీ బాధ్యతలకే పరిమితమవుతానని చెబుతూ రాజ్యసభ అవకాశం కోరతారని సమాచారం. అలాగూ గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ పదవుల భర్తీ కసరత్తుపై కూడా అధిష్టానంతో బొత్స చర్చించనున్నారు.
 
 నేడు రాహుల్‌తో సమావేశం
 పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు, లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై కసరత్తు కోసం పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో భేటీలో భాగంగా బొత్సతో కూడా రాహుల్ శనివారం భేటీ కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement