విద్యుత్‌ షాక్‌తో కౌలురైతు మృతి

The Death Of An Electric Shock - Sakshi

సాక్షి, కడియం (రాజమహేంద్రవరం రూరల్‌): దుళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు తోట చింతాలు (59) పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..  కౌలుకు తీసుకున్న చేనులో మోటారు తిరగడం లేదని అతడు గోతిలోకి దిగి చూశాడు. మోటార్‌ను తాకిన వెంటనే షాక్‌కు గురై గోతిలో కుప్పకూలిపోయాడు. తోటి రైతులు విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సరఫరాను నిలిపివేసి అతడిని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు స్థానిక ప్రైవేటు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎల్‌.కనకరాజు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని కడియం ఎసై ఎ.వెంకటేశ్వరరావు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

 

కౌలురైతు చింతాలు (ఫైల్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top