భానుకిరణ్‌కు ఆయుధం అమ్మిన డీలర్ అరెస్టు | Dealer arrested, who sells weapon to bhanu kiran | Sakshi
Sakshi News home page

భానుకిరణ్‌కు ఆయుధం అమ్మిన డీలర్ అరెస్టు

Sep 7 2013 4:01 AM | Updated on Sep 1 2017 10:30 PM

గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్‌కు ఆయుధం అమ్మడంతోపాటు ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన కేసులో ఆయుధ డీలర్ సయద్ రఫీక్ అహ్మద్‌ను రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్‌కు ఆయుధం అమ్మడంతోపాటు ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన కేసులో ఆయుధ డీలర్ సయద్ రఫీక్ అహ్మద్‌ను రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. భానుకిరణ్ నకిలీ అడ్రస్ ఇవ్వడం ద్వారా ఖమ్మం జిల్లా కలెక్టర్ నుంచి ఆయుధ లెసైన్సు పొందాడు. తప్పుడు అడ్రస్ ద్వారా ఆయుధ లెసైన్సు పొందేందుకు భానుకిరణ్‌కు ఆయుధ డీలర్ సయద్ రఫీక్ అహ్మద్ సహకరించినట్లు సీఐడీ విచారణలో తేలింది. దీంతో అహ్మద్‌ను సీఐడీ పోలీసులు అరెస్టుచేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement