చిట్‌ఫండ్‌ మోసగాళ్లకు శిక్ష పడాల్సిందే 

CS LV Subramaniam orders on Chitfund cheaters - Sakshi

సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు 

సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్‌ వంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు చేసే మోసాల కేసుల్లో అధికారులు సకాలంలో స్పందించి ఆర్థిక మోసగాళ్లకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో 17వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సీఎస్‌ అధ్యక్షతన జరిగింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిట్‌ఫండ్‌ కంపెనీలు లేదా బ్యాంకింగ్‌ సేవల పేరిట ప్రజల నుంచి నగదు వసూలు చేసి మోసాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు.

ఈ విషయంలో సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలను మోసం చేసేలా ఆయా సంస్థలు వివిధ మాధ్యమాల ద్వారా ఇస్తున్న ప్రకటనలపై నిఘా పెట్టాలన్నారు. అలాంటి ప్రకటనలను నిరంతరం పరిశీలించి చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. బ్యాంకులు, చిట్‌ఫండ్‌ కంపెనీలు, తదితర ఆరి్థక సంస్థల్లో ప్రజలు మదుపు చేసే సొమ్ముకు పూర్తి భరోసాను కలి్పంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి ఆర్థిక మోసాలను పూర్తిగా నివారించాలని కోరారు. రిజర్వ్‌ బ్యాంక్‌ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రతాదాస్‌ మాట్లాడుతూ ఆర్థిక మోసాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు ఆర్‌బీఐకి సహకారం అందించాలన్నారు.   

రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చాలి
రహదారి భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఎనిమిదో తరగతి నుంచి రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం సీఎస్‌ అధ్యక్షతన రోడ్‌ సేఫ్టీ ఫండ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం జరిగింది. సీఎస్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో రహదారి భద్రత సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రత పరికరాల కోసం పోలీసులకు రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రహదారి భద్రత నిధి కింద రూ.50 కోట్లను కేంద్రం ఈ ఏడాది కేటాయించిందని రవాణా, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. రవాణాశాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు రహదారి భద్రతపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top