ఏపీలో 152కు చేరిన కరోనా కేసులు | Coronavirus Positive Cases Rises In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 152కు చేరిన కరోనా కేసులు

Apr 2 2020 7:07 PM | Updated on Apr 2 2020 10:16 PM

Coronavirus Positive Cases Rises In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం రాత్రి వరకు మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 152కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 123 శాంపిల్స్‌ను పరీక్షించగా మొత్తం 11 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయినట్టుగా తెలిపారు. నేడు కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయిందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన కరోనా పరీక్షలో 143 మందికి పాజిటివ్‌గా తేలగా, 1321 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 409 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

జిల్లాల వారీగా కరోనా కేసులకు సంబంధించిన వివరాలు.. 

Advertisement
 
Advertisement
Advertisement