ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఒక విద్యార్థినిని వేధించిన ఇద్దరు కానిస్టేబుళ్లకు స్థానికులు దేహశుద్ధి చేశారు.
యువతిని వేధించిన కానిస్టేబుళ్లకు దేహశుద్ధి
Jul 12 2015 1:23 PM | Updated on Mar 19 2019 6:01 PM
ప్రకాశం: ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఒక విద్యార్థినిని వేధించిన ఇద్దరు కానిస్టేబుళ్లకు స్థానికులు దేహశుద్ధి చేశారు. రామాయపట్నం వద్ద పనిచేసే ఇద్దరు మెరైన్ కానిస్టేబుళ్లు నాగరాజు, ఖాదర్ మస్తాన్ చీరాల నుంచి రోజూ రైలులో వచ్చి పోతుంటారు. ఆదివారం ఉదయం అదే రైలులో తోటి స్నేహితురాళ్లతో కలసి ప్రయాణిస్తున్న విద్యార్థినిని వేధించారు. దీంతో బాధితురాలు తన తండ్రి రవిబాబుకు విషయం తెలిపింది. అనంతరం తండ్రి, కూతురు కారులో వెళ్తుండగా రైల్వేరోడ్డులోని ఓ హోటల్‌లో టిఫిన్ చేస్తున్న సదరు కానిస్టేబుళ్లు ఆమె వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు. దీంతో రవిబాబు కారును ఆపి, వేధింపుల విషయమై ప్రశ్నించాడు. దీనిపై కానిస్టేబుళ్లు అతనితో దురుసుగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని, కానిస్టేబుళ్లకు దేహశుద్ధి చేశారు.
Advertisement
Advertisement