కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు శివకుమార్, విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కాంగ్రెస్ నేత మీ సాల వరహాలనాయుడులు పెద్ద సంఖ్యలో వారి అనుచరులతో కలిసి వచ్చి పార్టీలో చేరారు.
వీరికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట పార్టీ నేతలు ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, పెన్మత్స సాంబశివరాజు, సుజయకృష్ణ రంగారావు, వి.బాలశౌరి, అవనపు విజయ్, గుదిబండ చిన వెంకటరెడ్డి తదితరులున్నారు.