వేరుశనగకు ధరలేకపోవడంతో రైతుకు ఏమీ మిగలడం లేదు. పైగా అప్పులు తీరడం లేదు. ప్రస్తుతం ఎకరా వేరుశనగ సాగుకు రూ.30వేలు ఖర్చవుతోంది.
మా బాధలు తీర్చండి సారూ..!
Jan 28 2014 3:35 AM | Updated on Sep 2 2017 3:04 AM
వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలి
వేరుశనగకు ధరలేకపోవడంతో రైతుకు ఏమీ మిగలడం లేదు. పైగా అప్పులు తీరడం లేదు. ప్రస్తుతం ఎకరా వేరుశనగ సాగుకు రూ.30వేలు ఖర్చవుతోంది. గిట్టుబాటుధరలు లేకపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదు. మీరైనా స్పందించి రైతులకు మంచి ధరలు కల్పించి ఆదుకోండి.
కాళ్లులేవు..పింఛన్ ఇచ్చి ఆదుకోండి
మాకు వయస్సు మీదపడింది, రెండేళ్ల క్రితం ప్రమాదంలో ఇద్దరం ఒక్కోకాలు పోగొట్టుకొన్నాం. నడవలేక ఏ పనిచేయలేకపోతున్నాం. దీంతో మా కుటుంబపోషణ భారంగా మారింది. వికలాంగుల పింఛన్ కోసం రెండేళ్లక్రి తం దరఖాస్తు చేసుకున్నాం.. ఇంతవరకు అతీగతి లేదు. మీరైనా కనికరించి పింఛన్ ఇచ్చి బతుకుదారి చూపండి..
చేపలపెంపకంపై కౌలును నిలిపేయాలి
చేపలను పెంచుకునేందుకు జిల్లాలో 1434 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో చాలావరకు ఎండిపోయాయి. ఈ కారణంగా చేపలను పెంచలేకపోతున్నాం. ఈ పరిస్థితులను పట్టించుకోకుండా ప్రభుత్వం చెరువులు, కుంటలపై కౌలు రకం పెంచింది. మా పరిస్థితిని అర్థంచేసుకుని కౌలురకాన్ని తగ్గించాలి.
ఉపాధి చూపండి
పుట్టకతోనే వికలాంగురాలిని, మాది పేద కుటుంబం కావడంతో అమ్మానాన్నలు కూలీచేస్తేనే కడుపునిండా భోజనం. లేదంటే పస్తులుండాల్సి వస్తోంది. ఇప్పుడు నా వయస్సు 18ఏళ్లు వచ్చినా, ఏపని చేయలేకపోతున్నా..నాకు వికలాంగుల కోటాలో ఏదైనా ఉపాధి కల్పించి నా కుటుంబాన్ని ఆదుకోండి సారూ..!
అంత్యోదయ కార్డులివ్వండి
మేమంతా వృద్ధులం ఏపనీ చేయలేం. కానీ మాకు అంత్యోదయ కార్డుల్లేని కారణంగా ప్రస్తుతం ఇస్తున్న బియ్యం సరిపోవడంలేదు. దీంతో బయట మార్కెట్లో బియ్యాన్ని కొనలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇక అంత్యోదయ కార్డుల కోసం చాలాసార్లు దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునేవారు. మీరైనా కార్డులు ఇచ్చి ఆదుకోండి సారూ..!
పొలాలకు దారికి స్థలం ఇవ్వండి
గ్రామ శివారులోని పంటపొలాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఈ కారణంగా పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మాకు దారి ఇచ్చేందుకు ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉంది. వెంటనే ఆ భూమిని దారికి కేటాయించినట్లయితే మా వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Advertisement
Advertisement