పరీక్షల సంఖ్య పెంచండి: సీఎం జగన్‌ | CM YS Jagan Holds Review Meeting On Covid-19 Preventions | Sakshi
Sakshi News home page

పరీక్షల సంఖ్య పెంచండి: సీఎం జగన్‌

Apr 26 2020 1:44 PM | Updated on Apr 26 2020 1:51 PM

CM YS Jagan Holds Review Meeting On Covid-19 Preventions - Sakshi

సాక్షి, అమరావతి :  కరోనా (కోవిడ్-19) పరీక్షల సంఖ్య మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు.  కోవిడ్‌–19 నివారణ చర్యలతో పాటు,  వైరస్‌ వ్యాప్తిని నియంత్రణపై ఆదివారం ఆయన  తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి జిల్లాలోనూ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అలాగే రెడ్‌ జోన్లులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఏపీలో మరో 81 కరోనా పాజిటివ్ కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement