ఏలూరు: సిఎం చంద్రబాబుకు సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఓ ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ఆపడానికి తాను ప్రధానమంత్రిని కలిశానని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఐదు లక్షల మంది నిర్వాసితుల సమస్య ఉందన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ప్రధానిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరానని తెలిపారు. నిర్వాసితులకు అందాల్సిన సొమ్ము కేంద్ర చట్టాల ప్రకారం రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సామాన్యులు కోర్టుకు వెళ్లడాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు విభజన హామీలపై కోర్టును ఆశ్రయిస్తామని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.