సీఎం చంద్రబాబు నేడు జిల్లాకు రాక | cm chandrababu district to arraival of today | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు నేడు జిల్లాకు రాక

Dec 15 2014 2:51 AM | Updated on Aug 21 2018 6:22 PM

సీఎం చంద్రబాబు నేడు జిల్లాకు రాక - Sakshi

సీఎం చంద్రబాబు నేడు జిల్లాకు రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం గన్నవరం రానున్నారు.

విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సోమవారం గన్నవరం రానున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం  ఉదయం 10 గంటలకు  ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ నుంచి ఆయన 10.45 గంటలకు హెలికాప్టర్‌లో ప్రకాశం జిల్లా కొండపి గ్రామానికి వెళతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానా శ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళతారు.

ముఖ్యమంత్రి విమానాశ్రయానికి రానుండడంతో  పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రోటోకాల్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విమానాశ్రయంలో సోమవారం భారీ భద్రత ఏర్పాటుచేయాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి. వెంకటేశ్వరరావు పోలీసు అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement