దర్యాప్తు పూర్తి చేశారో లేదో పరిశీలించండి | Check whether the investigation is complete | Sakshi
Sakshi News home page

దర్యాప్తు పూర్తి చేశారో లేదో పరిశీలించండి

Jan 19 2018 3:20 AM | Updated on Aug 31 2018 8:34 PM

Check whether the investigation is complete - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సత్యసాయి కుటుంబ సభ్యుడు గణపతిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుట్టపర్తి శ్రీసత్యసాయిబాబా ట్రస్ట్‌ సెంట్రల్‌ సభ్యుడు ఆర్‌.జె.రత్నాకర్‌పై పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు పూర్తి చేసి, సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారో లేదో తెలుసుకోవాలని సీఐడీ అదనపు డీజీని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను తెప్పించుకుని, దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉందా? తుది నివేదిక దాఖలు చేశారా? తదితర వివరాలన్నింటినీ పరిశీలించాలని స్పష్టంచేసింది.

సంబంధిత కోర్టులో తుది నివేదికను దాఖలు చేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ఇటీవల తీర్పునిచ్చారు. అటు పిటిషనర్, ఇటు పోలీసులు దీనిపై స్పష్టతనివ్వలేకపోతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement