రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ప్రారంభమైంది
నీరుకొండలో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రారంభం
Published Sat, Jul 15 2017 12:57 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మొక్కలు నాటారు. రాజధానిలో తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఇదే.
మంగళగిరి మండలం నీరుకొండ వద్ద నిర్మించిన ఈ వర్సిటీలో ఆగస్టు 7 నుంచి తరగతులు ప్రారంభం కానుండగా ఈ ఏడాది 240 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement