ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బృందం దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు.
దావోస్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బృందం దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీలో పెట్టుబడులతో వచ్చి కార్యాలయాలు ప్రారంభించాలని ప్రపంచ పారిశ్రామిక సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, అపార ఖనిజ సంపదతో పాటు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, నైపుణ్యం గల మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ వృద్ధి శాతం భారత్ వృద్ధి శాతం కంటే అధికంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.