
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్రం సహకరించకు న్నా ఈ ప్రాంత ప్రజల సాకారమయిన రామాయపట్నం పోర్టుతోపాటు షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం దుగరాజపట్నం పోర్టు ఇస్తానని ఇవ్వలేదని.. అందుకే రూ.4,200 కోట్లతో రామాయపట్నం నిర్మిస్తున్నామన్నారు. రామాయపట్నం పోర్టు, ఏషియన్, పల్ప్ అండ్ పేపర్ మిల్లు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ 2021కి 20.26 మిలియన్ టన్నుల కెపాసిటీతో పోర్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ఈనెల 29కి అనంతపురంలో కియా పరిశ్రమ తొలి కారు రోడ్డు మీదకు వస్తుందన్నారు. ఎన్నికలు ఒక్క నెల ఉన్నాయనగా అగ్రవర్ణాల రిజర్వేషన్లు తెరపైకి తెచ్చారని, అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు.