
అగ్రిగోల్డ్ స్కాంతో బాబుకు సంబంధాలు: బొత్స
అగ్రిగోల్డ్ స్కాంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు ఆయన అనుచరులకు కూడా సంబంధాలు ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
అగ్రిగోల్డ్ స్కాంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు ఆయన అనుచరులకు కూడా సంబంధాలు ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే అగ్రిగోల్డ్ స్కాం మీద న్యాయపరమైన చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. చంద్రబాబు తన పబ్బం గడుపుకోడానికి, తన ఆలోచనల కోసం భేషజాలకు పోవడం మంచిది కాదని బొత్స హితవు పలికారు.
ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అసలు ఏపీకి ఎందుకు రావాలని.. ఆయన ఏపీకి చేసిందేంటని బొత్స ప్రశ్నించారు. తన వాక్చాతుర్యంతో ప్రజల చెవిలో క్యాబేజి పువ్వు పెట్టాలని చూశారని, కానీ ప్రజలే ఆయన్ను రాష్ట్రానికి రానివ్వరని బొత్స చెప్పారు.