'విద్యార్థుల విషయంలో బాబు విఫలం' | chandra babu failed in all aspects, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

'విద్యార్థుల విషయంలో బాబు విఫలం'

Aug 4 2014 2:28 PM | Updated on Sep 5 2018 9:18 PM

'విద్యార్థుల విషయంలో బాబు విఫలం' - Sakshi

'విద్యార్థుల విషయంలో బాబు విఫలం'

విద్యార్థుల సమస్య పరిష్కారం విషయంలో చంద్రబాబు విఫలం అయ్యారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంతో పాటు అన్ని మార్గదర్శకాలు విభజన చట్టంలో ఉన్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సొంత జిల్లా విజయనగరంలో ఆయన సోమవారం నాడు విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికల సమయంలో ఎడాపెడా ఇచ్చేసిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసి తీరాలని బొత్స డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్య పరిష్కారం విషయంలో చంద్రబాబు విఫలం అయ్యారని విమర్శించారు. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 1956 నుంచి ఉండాలంటూ స్థానికత విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బొత్స అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement