ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో ఇటీవల పర్యటించినపుడు ఇచ్చిన హామీలపై దృష్టి సారించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులకు సూచించారు.
కలెక్టర్ ఎంఎం నాయక్
విజయనగరం కంటోన్మెంట్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో ఇటీవల పర్యటించినపుడు ఇచ్చిన హామీలపై దృష్టి సారించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు ఇస్తున్న భూములలో సమస్యలు తలెత్తితే రిజిస్ట్రేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నెల్లిమర్ల మండలంలోని తమ్మాపురం, టెక్కలి, ఒంపిల్లి గ్రామాల్లోని 262 ఎకరాల్లో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు.
రామభద్రపురం మండలంలోని కొట్టక్కిలో ఆటోమొబైల్ షాపు ఏర్పాటుకు 200 ఎకరాల్లో సర్వే జరుగుతోందన్నారు. గజపతినగరం మండలం మరుపల్లిలో హార్డ్‌వేర్ పరిశ్ర మ ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులపై కలెక్టర్ ఆరా తీయగా 60 శాతంపనులు పూర్తయ్యాయని, మే లోగా ప్రారంభిస్తామని విద్యుత్ శాఖ ఎస్ ఈ చిరంజీవిరావు తెలిపారు.
బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఇటుకల తయారీ పరి శ్రమ కోసం పవన్ ఇండస్ట్రీస్‌కు రూ. 1.37 లక్షలు మంజూరు చేశామన్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి, మదనాపురం గ్రామాల వద్ద వంద ఎకరాల్లో హెర్బల్ టూరిజం పార్కు ఏర్పాటుకు, భోగాపురం మండలం చెరకుపల్లి,రాజాపులోవ గ్రామాల వద్ద 90 ఎకరాల్లో ఐటీ పార్కుఏర్పాటుకు, దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామం వద్ద 83 ఎకరాల్లో ఫుడ్ పార్కు ఏర్పాటుకు ప్రతి పాదనలు ఏపీఐఐసీచైర్మన్‌కు పంపించామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సహించేలా అధికారులంతా పనిచేయాలన్నారు. ఈసమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ చిరంజీవిరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, ఏపీఐసీసీ జోనల్ మేనేజర్ సారథి, జిల్లారిజిస్ట్రార్ తదితర అధికారులు పాల్గొన్నారు.