నిద్రిస్తున్న భార్యను అతికిరాతకంగా నరికి చంపాడో భర్త.
నిద్రిస్తున్న భార్య పై గొడ్డలితో దాడి చేసి అతికిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని భాగ్యన గర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న జమాల్ అలి తన భార్య హుసేన్‌బీ(28) నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి నరికేశాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు.