లాక్‌డౌన్‌ పొడిగింపు; ‘తగిన చర్యలు తీసుకుంటాం’

Botsa Stayanarayana Said Will Take action Without Drinking Water Problems - Sakshi

సాక్షి, విజయనగరం : విజయనగరంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకొని ప్రతిరోజూ నీరు ఇచ్చే విధంగా తోటపల్లికి నీరు తీసుకువస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసానిచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపల్‌ కమినర్‌లతోనూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేస్తామని తెలిపారు. ప్రతి మూడు రోజులకొకసారి ఐవీఆర్‌ఎస్ ద్వారా కొన్ని ప్రమాణాలపై అభిప్రాయం సేకరణ చేస్తుంటామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలోనే తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు చేపట్టామని తెలిపారు. ప్రతిరోజూ కరోనా నియంత్రణ చర్యలు, ప్రజల సంక్షేమం, రైతు సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
(అందుకే ఆసుపత్రిలో ‘రిషి’ని చూడలేదు: అమితాబ్‌ )

విజయనగరంలో కరోనా పాజిటివ్ నమోదు లేకుండా యంత్రాంగం కృషి చేస్తోందని ప్రశంసించారు. గుజరాత్ నుంచి వచ్చే మత్స్యకారులను ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి 60 మంది  విద్యార్థులు నడుచుకొని వస్తున్న విషయాన్ని తెలుసుకొని వారిని మూడు బస్సుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తీసుకు వస్తున్నామని వెల్లడించారు. ఎవరు ఎక్కడ ఉన్నారని తెలిస్తే వారిని క్షేమంగా వారి ఇళ్లకు తీసుకు వస్తామని పేర్కొన్నారు. వలస దారుల గురించి ఏ విధమైన సమాచారం అందినా వారిని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించినట్టు సమాచారం వచ్చిందని,. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. (ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌ జోన్లు ఇవే )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top