ఏపీ నుంచి ‘బొర్రా గుహలు’ | borra caves blue print for republic day march in delhi | Sakshi
Sakshi News home page

ఏపీ నుంచి ‘బొర్రా గుహలు’

Sep 17 2016 7:06 AM | Updated on Jun 2 2018 2:56 PM

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే శకటాల్లో ఏపీ నుంచి ప్రతిపాదించిన పలు శకటాల్లో బొర్రా గుహల నేపథ్య శకటాన్ని కేంద్రం ప్రాథమికంగా ఎంపిక చేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే శకటాల్లో ఏపీ నుంచి ప్రతిపాదించిన పలు శకటాల్లో బొర్రా గుహల నేపథ్య శకటాన్ని కేంద్రం ప్రాథమికంగా ఎంపిక చేసింది. శకటాల ఎంపికకు కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఏపీ నుంచి కూచిపూడి, బౌద్ధం, చింతల వెంకట రమణ స్వామి ఆర్కిటెక్చర్, కొండపల్లి బొమ్మలు, బొర్రా గుహలు, సాంప్రదాయ గిరిజన నృత్యం తదితర నేపథ్య శకటాలను ప్రతిపాదించగా నిపుణుల కమిటీ బొర్రా గుహల నేపథ్య శకటానికి ప్రాథమిక జాబితాలో చోటు కల్పించింది. మలి విడత ఎంపిక ప్రక్రియలో ఈ శకటం ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement