
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రామైన బొర్రా వద్ద బొంగు చికెను అందరికి తెలుసు. బొంగు బిరియాని కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. బొర్రా వద్ద హోటళ్ల నిర్వాహకులు బొంగు బిరియానితో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. బొర్రా గుహలకు వెళ్లే పర్యాటకుల నుంచి ముందుకు ఆర్డర్ తీసుకుని వారు తిరిగి వచ్చే సమయానికి సిద్ధం చేస్తున్నారు. అరకిలో బొంగు బిర్యానీని రూ.250 నుంచి రూ.300కు విక్రయిస్తున్నట్టు హోటల్ యజమాని దారు తెలిపాడు.