
ఇలాగైతే కేసీఆర్ ఎక్కువ రోజులు సీఎంగా ఉండరు
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై మండిపడ్డారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై మండిపడ్డారు. కేసీఆర్ తన తీరు మార్చుకోవడం మంచిదని, లేకపోతే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగలేరని హెచ్చరించారు.
హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉండటమే సబబు అని గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం గత యూపీఏ ప్రభుత్వం తీసుకుందని మంత్రి వ్యాఖ్యానించారు. అప్పుడు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.