
'ఏం చేస్తారో నాకు తెలీదు ... దొంగలను పట్టుకోండి'
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అటవీశాఖ గోడౌన్ నుంచి లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలు మాయమైనాయి.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అటవీశాఖ గోడౌన్ నుంచి లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలు మాయమైనాయి. దాంతో అటవీశాఖ ఉన్నతాధికారులు శనివారం పట్టణంలోని రెండవ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీశాఖ ఉద్యోగులే ఈ ఎర్రచందనం దుంగలను మాయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు. గోడౌన్ నుంచి మాయమైన ఎర్రచందనం విలువు రూ. 50 లక్షలు ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
గోడౌన్ నుంచి ఎర్రచందనం దుంగలు మాయమైన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడవులు, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి అటవీశాఖ అధికారులపై మండిపడ్డారు. అటవీశాఖ మంత్రిగా ఉన్న తన సొంత నియోజకవర్గంలోనే అరకోటి విలువైన ఎర్రచందనం మాయం ఏలా అయిందంటూ సదరు అధికారులపై బొజ్జల నిప్పులు తొక్కారు. ఏం చేస్తారో నాకు తెలీదు. దొంగలను వెంటనే పట్టుకోండి అంటూ అటవీశాఖ అధికారులను బొజ్జల ఆదేశించారు.