టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదు: బీజేపీ | BJP not alliance with TDP: Ch Vidyasagar Rao | Sakshi
Sakshi News home page

టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదు: బీజేపీ

Oct 17 2013 8:33 PM | Updated on Mar 29 2019 9:18 PM

టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదు: బీజేపీ - Sakshi

టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదు: బీజేపీ

తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, కావాలనే కొందరు బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారని మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్‌రావు అన్నారు.

రామచంద్రాపురం: తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, కావాలనే కొందరు బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారని మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా బీహెచ్‌ఈఎల్‌కు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తాము టీడీపీతో పొత్తు పెట్టుకోలేదని, పెట్టుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోల్పోతున్నట్టుగా ప్రచారాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి సరైన చిత్తశుద్ధిలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవ్వరూ అడ్డుకోలేరని, తప్పనిసరి పరిస్థితుల్లో  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించిందన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేవరకు నమ్మకం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement