'తప్పొప్పులు తేలిన తర్వాతే పొత్తుల విషయం' | BJP MLA Kishan reddy advice to KCR and Chandrababu | Sakshi
Sakshi News home page

'తప్పొప్పులు తేలిన తర్వాతే పొత్తుల విషయం'

Jun 13 2015 1:37 PM | Updated on Mar 28 2019 8:41 PM

'తప్పొప్పులు తేలిన తర్వాతే పొత్తుల విషయం' - Sakshi

'తప్పొప్పులు తేలిన తర్వాతే పొత్తుల విషయం'

రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారం ఏసీబీ, న్యాయస్థానాలు చూసుకుంటాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారం ఏసీబీ, న్యాయస్థానాలు చూసుకుంటాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో కిషన్రెడ్డి మాట్లాడుతూ... ఈ అంశంపై కేంద్రానికి తాము ఇవ్వాల్సిన నివేదిక ఇచ్చామని తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని సూచించారు. అలాగే ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి... ఇద్దరు సీఎంలకు హితవు పలికారు.

ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని కేసీఆర్కు లేఖ రాస్తున్నట్లు కిషన్రెడ్డి చెప్పారు. అయితే తప్పు, ఒప్పులు తేలిన తర్వాత పొత్తుల విషయం చూద్దామని విలేకర్లు అడిగి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement