ప్రత్యేక హోదా కోసం నెల్లూరు జిల్లాలో బైకు ర్యాలీ | bike rally in nelloor | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం నెల్లూరు జిల్లాలో బైకు ర్యాలీ

Oct 18 2015 8:13 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.  నాయుడు పేట లో బైకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement