ఇటువైపు నవ్వు ముఖమే పెట్టడం లేదు అధ్యక్షా! | Bhuma Nagi Reddy comments on speaker kodela sivaprasad | Sakshi
Sakshi News home page

ఇటువైపు నవ్వు ముఖమే పెట్టడం లేదు అధ్యక్షా!

Aug 25 2014 10:08 AM | Updated on Jul 29 2019 2:44 PM

ఇటువైపు నవ్వు ముఖమే పెట్టడం లేదు అధ్యక్షా! - Sakshi

ఇటువైపు నవ్వు ముఖమే పెట్టడం లేదు అధ్యక్షా!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేసిన సరదా వ్యాఖ్యలకు నవ్వులు పూశాయి.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేసిన సరదా వ్యాఖ్యలకు నవ్వులు పూశాయి. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ స్పీకర్ అయిన తర్వాత తమవైపు నవ్వు ముఖమే పెట్టడం లేదని భూమా అన్నారు. అంతకు ముందు సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని భూమా నాగిరెడ్డి కోరారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ఆయన ఈ మేరకు  విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని సభ సక్రమంగా నిర్వహించేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని స్పీకర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement