గుంటూరును రాజధాని చేస్తే ఉద్యమం

నంద్యాల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరును రాజధానిగా ప్రకటిస్తే రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో ఆయన మాట్లాడారు.
కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని ఆందోళనలు జరుగుతుంటే మంత్రులు మాత్రం గుంటూరు నామస్మరణ చేస్తున్నారని అన్నారు. రాజధాని ఎంపికలోసీమ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని భూమా డిమాండ్ చేశారు.