ఫ్యాక్షన్‌కు చరమగీతం పాడాలి

Avinash Reddy Talk About Kadapa Politics - Sakshi

జమ్మలమడుగువ(వైఎస్సార్‌ కడప):  నియోజకవర్గంలో ఫ్యాక్షనిస్టుల పరిపాలన సాగుతోందని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్యాక్షన్‌కు చరమగీతం పాడాలని, తిరిగి వైఎస్‌ కాలం నాటి పరిపాలన రావాలన్నారు. సోమవారం జమ్మలమడుగులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుపేదల కోసం సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌గృహ కల్ప పేరుతో మూడువందల చదరపు అడుగుల ఇంటిని నిర్మించి నిరుపేదలకు ఇస్తామని చెబుతున్నారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి మూడు లక్షలరూపాయలతో ఇంటికోసం నిరుపేదలకు ఇస్తున్నారు. అదనంగా లబ్ధిదారుని పేరుతో బ్యాంకుల్లో మూడున్నర లక్షల అప్పుగా ఇచ్చి దానికి నెలకు 3వేల రూపాయలతో 20 సంవత్సరాల పాటు చెల్లించాలి. అంటే నెలకు మూడు వేల రూపాయలు ఇంటికి బాడుగగా బ్యాంకులకు చెల్లించాలని, ఇదెక్కడి న్యాయమని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. కనీసం రెండు సెంట్లు కూడా లేకుండా అపార్టుమెంట్‌లు కట్టి ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఉండలేరు. అలాంటి ఇళ్లను నిరుపేదలకు ఆరు లక్షల రూపాయలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి జగన్‌ ముఖ్యమంత్రి అయితే నిరుపేదలు బ్యాంకులకు కట్టాల్సిన మూడున్నర లక్షల రూపాయలను మాఫీ చేసి వారిపేరుమీద ఇంటికి సంబంధించిన పత్రాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యదర్శి హర్షవర్థన్‌రెడ్డి, శింకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి,మైనార్టీ నాయకులు కులాయ్‌భాష, ఇస్మాయిల్, ఎర్రగుడి భాష ఖాదర్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top