
ఎదురీత
మత్స్యకారులు నష్టాల కడలిలో ఈదుతున్నారు. ప్రకృతి కరుణించక పల్టీలు కొడుతున్నారు.
పడిపోయిన చేపల లభ్యత
నిలిచిన ఎగుమతులు
75 శాతం ఒడ్డునపడ్డ బోట్లు
మత్స్యకారులు విలవిల
విశాఖపట్నం: మత్స్యకారులు నష్టాల కడలిలో ఈదుతున్నారు. ప్రకృతి కరుణించక పల్టీలు కొడుతున్నారు. పుష్కలంగా చేపలు లభ్యం కావలసిన సమయంలో వాటి జాడలేక ఉసూరుమంటున్నారు. దాదాపు నెల రోజుల నుంచి వేట ఆశాజనకంగా సాగక వందలాది బో ట్లను జెట్టీలకే పరిమితం చేశారు. మరోవైపు ఎగుమతులూ నిలి చిపోయాయి. విశాఖ నుం చి సుమారు 650 మరబోట్లు వేట సాగిస్తుం టాయి. వీటిలో నిత్యం 40-50 బోట్లు చేపలతో హార్బర్‌కు చేరుకుంటాయి. చేపల ల భ్యత బాగుంటే ఒక్కో బోటు సగటున మూ డు టన్నుల వరకు తెస్తా యి. ఇలా కనీసం రోజుకు 100 టన్నుల చేపలు హార్బర్‌కు వస్తాయి. వీటిలో మూడొంతులు తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఇన్సులేటెడ్ వాహనాల్లో ఎగుమతి అవుతుంటాయి. మిగిలినవి స్థానిక అవసరాలకు వినియోగమవుతాయి. కానీ కొన్నా ళ్ల నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు నిలి చిపోయాయి. అక్కడ ప్రస్తుతం చేపల విని యోగం తగ్గించడం, ఆయా ప్రాంతాల్లోనూ స్థానిక అవసరాలకు సరిపడినంతగా చేపలు లభ్యత వంటి కారణాలతో ఎగుమతులు లేకుం డా పోయాయని చెబుతున్నారు. ఎగుమతుల్లేక స్థానిక అవసరాలకు మించి చేపలు హార్బరులో దొరకడం వల్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఆరు కిలోల బరువుండే బుట్ట చేపలు (పెద్ద, బల్ల గులివిందలు, పారలు, బడేమట్టలు వంటి రకాలు) ధర రూ.600ల నుంచి 400లకు పడిపోయింది. వీటిలో చిన్నరకాలైతే రూ.450 నుంచి 200లకు దిగజారింది. ఫలితంగా గిట్టుబాటు ధర రాక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో 75 శాతానికి పైగా బోట్లను ఫిషింగ్ హార్బర్‌లోనే లంగరేసి ఉంచేశారు. అందులో పనిచేస్తున్న కళాసీలు ఇళ్లకే పరిమితమయ్యారు.
సీజన్‌లో అన్‌సీజన్..
అక్టోబర్ నెల నుంచి సముద్రంలో చేపలు విరివిగా చిక్కుతాయి. అందువల్ల ఈ సీజనులో లాభాలొస్తాయని మత్స్యకారులు సంబరపడతారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దీంతో పది, పదిహేను రోజులకు సరిపడా సరంజామాతో బోట్లలో వేటకెళ్లే వారు.. అరకొర చేపలే దొరకడం వల్ల వారం రోజులకే వెనక్కి తిరిగొచ్చేస్తున్నారు. చేపల సీజనుగా భావించే అక్టోబర్‌లో ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదని వైశాఖి డాల్ఫిన్ బోటు ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీహెచ్. సత్యనారాయణమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. జులై, ఆగస్టుల్లో వేట బాగుంద న్న సంతోషం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుపవనాలు ఆశాజనకంగా లేకపోవడంతో పాటు అండర్ వాటర్ కరెంటు (మత్స్యకారులు ఒడుసుగా పేర్కొంటారు) ఎక్కువగా ఉండడం కూడా చేపల లభ్యత తగ్గడానికి ఒక కారణమని రాష్ట్ర మరపడల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీసీ అప్పారావు అభిప్రాయపడ్డారు.